- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థి సంఘాలు
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీవీఎం, యూఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలోని ఐక్య విద్యార్థి సంఘాలు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి.

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీవీఎం, యూఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలోని ఐక్య విద్యార్థి సంఘాలు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. భారీ ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలతో అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఎంపీ వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు గత కొంతకాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిగిన నిరసనల సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యార్థి ఉద్యమాన్ని చులకన చేసేలా, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎంపీపై బీజేపీ పార్టీ తక్షణమే చర్యలు తీసుకుని ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల పోరాటాన్ని సమర్థించిన వ్యక్తి, ఇప్పుడు విద్యార్థుల ఉద్యమాలపై భిన్నంగా మాట్లాడటం విచారకరమని పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీవీఎం ఉమ్మడి రాష్ట్రాల కో-ఆర్డినేటర్ బట్టు శ్రీధర్, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్, విద్యార్థి నాయకులు జవహర్, సురేందర్, యువ నాయకులు రాజేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






