రూ. 50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ

by Kodari Anjali |

మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం మధ్యాహ్నం ఆలయ అర్చకుడు అర్చకుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు.

రూ. 50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ
X

దిశ, మక్తల్: మండల పరిధిలోని వల్లభాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తుల మౌలిక వసతుల కోసం రూ. 50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం మధ్యాహ్నం ఆలయ అర్చకుడు అర్చకుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. గురువులకే గురువు అతి పురాతనమైన దత్తాత్రేయ స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతాల నుండి వచ్చే భక్తుల మౌలిక వస్తువుల కోసం ఇబ్బందులు పడకుండా వారికి టాయిలెట్స్ విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడానికి గాను నేటి భూమి పూజ చేసుకున్నామని ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దత్తాత్రేయ ఆలయం ఆధ్యాత్మిక విశిష్టతను మరింత పెంపొందించేలా చేపట్టనున్న అభివృద్ధి పనులు భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. భక్తులు కల్పించే మౌలిక వసతులు పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ తాహసీల్దార్ సతీష్ కుమార్ ఆర్ఐ రాజు, పసుపుల గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story