- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూజివీడులో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు
నూజివీడులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నూజివీడులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. కోయిలగూడెం నుంచి గుంటూరు వెళ్తున్న పొగాకు లోడు వాహనాన్ని నూజివీడులోని ఓ పెట్రోల్ బంకు వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమారుడు బషీర్, అతడి అనుచరులు అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం పొగాకు వ్యాపారి అభి, లారీ డ్రైవర్‌ను బలవంతంగా కిడ్నాప్ చేసి.. గుంటూరులోని ఓ గెస్ట్ హౌస్‌లో నిర్బంధించినట్లు సమాచారం.
బాధితుల కుటుంబ సభ్యుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు.. కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారిని, డ్రైవర్‌ను సురక్షితంగా రక్షించినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని బషీర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కాగా, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గుంటూరు వెళ్లినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా.. కిడ్నాప్ సమయంలో ముస్తఫా మాట్లాడినట్లుగా భావిస్తున్న కాల్ డేటాను కూడా పోలీసులు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి.






