ఎమ్మెల్యే బాలరాజుకు పవన్ కల్యాణ్ క్లాస్.. పని తీరుపై ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-23 12:08:59  IST  )

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కలిశారు...

ఎమ్మెల్యే బాలరాజుకు పవన్ కల్యాణ్ క్లాస్.. పని తీరుపై ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌(Janasena Party Chief Pawan Kalyan)ను పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(Polavaram Constituency MLA Chirri Balaraju) కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలను జనసేనానికి వివరించారు. అయితే ఈ భేటీలో భాగంగా ఎమ్మెల్యే బాలరాజు పనితీరుపై పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. పార్టీ దృష్టికి వచ్చిన కొన్ని స్థానిక అంశాలు, ఫిర్యాదులపై ఎమ్మెల్యే నుంచి పవన్ కల్యాణ్ వివరణ కోరారు. నియోజకవర్గంలో ఎదురవుతున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, వాటన్నింటినీ రాబోయే నాలుగు వారాల్లోగా సరిదిద్దుకోవాలని సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష

అదేవిధంగా పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.147 కోట్ల నిధులు, పనుల పురోగతిపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు. మంజూరైన పనులను వేగవంతం చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పార్టీ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలని ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేశారు.

తేడా తెలుసుకో.. లేదంటే ఊరుకోం: ప్రకాశ్ రాజ్‌కు జనసేన శతఘ్ని టీమ్ వార్నింగ్

Next Story