- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేడా తెలుసుకో.. లేదంటే ఊరుకోం: ప్రకాశ్ రాజ్‌కు జనసేన శతఘ్ని టీమ్ వార్నింగ్
ప్రశ్నించడానికి, తప్పుడు ప్రచారాలకు తేడా తెలుసుకోవాలని నటుడు ప్రకాశ్ రాజ్(Actor Prakash Raj)కు జనసేన శతఘ్ని టీమ్ సూచించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రశ్నించడానికి, తప్పుడు ప్రచారాలకు తేడా తెలుసుకోవాలని నటుడు ప్రకాశ్ రాజ్(Actor Prakash Raj)కు జనసేన శతఘ్ని టీమ్ సూచించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ(Ycp) ప్రభుత్వంలో రోడ్లు బాగాలేవని, వేయండి అని ప్రశ్నించినందుకు తమ జనసైనికుడు వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసేస్తే అప్పుడు స్పందించకుండా ఎక్కడికి వెళ్ళావ్ అని ప్రశ్నించారు. వైసీపీ హయంలో నిద్ర పోతున్నావా? లేక కేవలం NDA సంబంధించిన విషయాల్లో మేలుకుంటావా? అని నిలదీశారు. వెంగయ్య నాయుడు అడిగింది ప్రశ్న అని, నాగేశ్వర్ చేసింది తప్పుడు ఆరోపణలు అని గుర్తు చేశారు. ప్రజల్లో తప్పుడు సమాచారం పంపించేలా ఆధార రహిత కథనాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారని మండిపడ్డారు.
నిన్ను భరిస్తూ వస్తున్నాం
‘‘ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంది, తప్పులను ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ జనసేన. అందుకే నువ్వు ఎన్నిసార్లు అవగాహన రాహిత్యంతో విమర్శలు చేస్తున్నా భరిస్తూ వస్తున్నాం. నువ్వు చెప్పినట్లు అణచి వేయాలి అనుకుంటే మొదటి కేసు నీ మీద పడేది కదా ప్రకాశ్?. తప్పుడు ఉద్దేశాలతో ప్రజలను మభ్యపెట్టాలని, బురద చల్లాలని చూస్తే చూస్తూ ఊరుకోం.’’ అని జనసేన శతఘ్ని టీమ్ హెచ్చరించింది.






