మోదీ పిలుపు.. కాన్వాయ్‌ని తగ్గించిన పవన్ కళ్యాణ్

by velandi.Saikiran |   (  Updated:2026-05-14 12:56:08  IST  )

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపు మేర‌కు కాన్వాయ్‌ని తగ్గించాడు పవన్ కళ్యాణ్.

మోదీ పిలుపు.. కాన్వాయ్‌ని తగ్గించిన పవన్ కళ్యాణ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంధన వాడకాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో మంచి స్పందన వస్తోంది. మోడీ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ ని తగ్గించుకున్నాడు. తన కాన్వాయ్ లోని వాహనాలను 50% తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. జిల్లాల‌ పర్యటనల్లోనూ వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యలు సూచించిన మోడీ స్వయంగా పాటిస్తున్నారని.. ఆ స్ఫూర్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

పొదుపు చర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండకూడదు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Next Story