- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొదుపు చర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండకూడదు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజలను భయపెట్టేలా ఉండకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజలను భయపెట్టేలా ఉండకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సూచన చేయగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి 48 గంటల ముందే ప్రజలను సన్నద్ధం చేసి.. సమయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ప్రకటిద్దామని తెలిపారు. ఇక మంత్రుల కార్యదర్శులు తమతమ శాఖల పరిధిలో పొదుపు చర్యలు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలపై అధ్యయనం చేసి.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అలాగే.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కింద లక్ష కోట్ల రూపాయల ఖర్చు ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం కాన్వాయ్ కుదింపు
పొదుపు చర్యల్లో భాగంగా.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తమ కాన్వాయ్ లను తగ్గించుకున్నారు. సీఎం కాన్వాయ్ 4 వాహనాలకే పరిమితమైంది. పైలెట్, ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే బుధవారం ఆయన సచివాలయానికి వెళ్లారు. కాన్వాయ్ లో రెండు ఎన్ఎస్ జీ సెక్యూరిటీ వెహికల్స్, ఎస్కార్ట్ వెహికల్స్ మాత్రమే ఉన్నారు. గతంలో సీఎం కాన్వాయ్ వెహికల్స్ సంఖ్య 12గా ఉండేది. మంత్రి లోకేష్ కాన్వాయ్ కూడా రెండు వాహనాలకే పరిమితమైంది. తన భద్రతా సిబ్బంది కోసం మినీ వ్యాన్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తన కాన్వాయ్ వెహికల్స్ సంఖ్యను కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లాల పర్యటనలోనూ వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయించారు. దీంతో ఆయన కాన్వాయ్ లో వాహనాల సంఖ్య మూడుకు తగ్గించారు.






