- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ CMగా పవన్ కల్యాణ్.. చంద్రబాబు స్పెషల్ ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రులకు శాఖలను కేటాయించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే జనసేన చీఫ్, ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ కు అందరూ ఊహించినట్లుగానే డిప్యూటీ సీఎం పదవి దక్కింది. దీంతో పాటు ఆయనకు పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను చంద్రబాబు కేటాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌కు స్పెషల్ విషెస్ తెలిపారు.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు.. ఇతర శాఖలు పొందిన సహచర మంత్రులకు కూడా అభినందనలు. ఏపీలో ప్రజల పాలన లక్ష్యంగా తాము ఇటీవల ప్రమాణ స్వీకారం చేశామని.. కలిసికట్టుగా తామంతా ముందుకు సాగుతామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రులంతా పనిచేస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సేవ మరియు భక్తితో యాత్రను ప్రారంభించిన మంత్రులందరికీ శుభాభినందనలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Also Read...
Pawan Kalyan: పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన వైసీపీ కీలక నేత






