Pawan Kalyan: పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన వైసీపీ కీలక నేత

by Indraja |   (  Updated:2024-06-14 10:38:39  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

Pawan Kalyan: పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన వైసీపీ కీలక నేత
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా కూటమి విజయంపై తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పందించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌ను అంచనా వేయలేకపోవడంతోనే వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

కూటమి గెలుపులో క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్‌కి చెందుతుంది అని ఆయన పేర్కొన్నారు. అలానే అందరూ కలిశారు కనుకనే కూటమిని ప్రజలు నమ్మారని, ఇందులో తప్పుపట్టాల్సింది ఏది లేదని ఆయన పేర్కొన్నారు.



Next Story