- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారా లోకేశ్‌కు మరో కీలక బాధ్యతలు.. మహానాడు వేదికగా నాయకుల ప్రతిపాదనలు
మంత్రి నారా లోకేశ్‌లోని యువ నాయకత్వ లక్షణాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Nara lokesh)లోని యువ నాయకత్వ లక్షణాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. మంత్రిగా ఉన్న ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Tdp Chief Chandrababu Naidu), మహావేదిక ఎదుటే స్పష్టం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తానున్నానంటూ పాదయాత్ర చేసి అందరికీ భరోసా ఇవ్వడంతో నేతలు, నాయకులు తెలుగుదేశం పార్టీ రథసారథిగా నారా లోకేశ్‌ను కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని గతంలోనే తెరపైకి తీసుకొచ్చినా బహిరంగంగా చెప్పలేదు. దీంతో మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే నిర్వహించిన ‘మినీ మహానాడు’లోనే ఇదే విషయంపై తీర్మానాలు కూడా చేశారు. పార్టీని తండ్రి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) లాగే పటిష్టంగా ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకాన్ని అటు సీనియర్ నాయకులు సైతం చెబుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి(Former Cm Nandmuri Taraka Ramarao) సందర్భంగా కడప(Kadapa)లో నిర్వహించిన మహానాడు(Mahanadu) వేదికగా మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్ర(Former Minister Dulipalla Naredra) ప్రతిపాదన చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలు, నాయకుల విజ్ఞప్తులతో నారా లోకేశ్(Nara Lokesh)కు పార్టీలో కీలక పదవి లభించబోతోందనే సంకేతాలు క్లియర్‌గా అర్ధమవుతున్నాయి.
Also Read..






