గ్రహణం వీడింది.. విజయం జరుపుకుందాం: నారా లోకేశ్‌ పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 13:21:34  IST  )

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర పడింది. ఉభయసభల్లోనూ చర్చించిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు....

గ్రహణం వీడింది.. విజయం జరుపుకుందాం: నారా లోకేశ్‌ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు(AP capital Amaravati legalization bill)కు పార్లమెంట్ ఆమోదముద్ర(Parliament Approval) పడింది. ఉభయసభల్లోనూ చర్చించిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి(Amaravati) చట్టబద్ధత పొందింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి, ప్రధాని మోడీ(Pm Modi)కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన ఘటనలపైనా ఆయన స్పందించారు. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని, ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని చెప్పారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాలని, ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుందామని పిలుపునిచ్చారు. మన రాజధాని మన గౌరవం అని, దీపాలతో సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయాలని #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో అందరూ షేర్‌ చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు.

మళ్లీ అలా కలలో కూడా జరగదు: ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

Next Story