మళ్లీ అలా కలలో కూడా జరగదు: ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 13:20:56  IST  )

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక నిర్ణయమని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు..

మళ్లీ అలా కలలో కూడా జరగదు: ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక నిర్ణయమని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన వేళ ఆమె స్పందించారు. గురువారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ప్రారంభమైన ఈ దివ్య ముహూర్తం ఐదు కోట్ల ఆంధ్రుల గుండెల్లో కొత్త ఆశరేపిందన్నారు. అమరావతి పై ఇప్పుడు చట్ట ముద్ర పడిందని, ఇక ఆ రాజధానిని నుంచి ఒక్క ఇటుక కూడా ఎవరూ కదిలించలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల త్యాగంతో నిర్మించిన ఈ రాజధానికి ఎవరైనా నష్టం చేయాలని చూస్తే ప్రజలే సమాధానం చెప్తారని ఎమ్మెల్యే బంగారు శ్రావణి శ్రీ హెచ్చరించారు.

ఇంతకాలం మభ్యపెట్టి..

ఇంతకాలం అమరావతి రైతులను మభ్యపెట్టి, రాజధానిపై అప్రజాస్వామిక ప్రయోగాలు చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదని బంగారు శ్రావణి శ్రీ జోస్యం చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టమైందని, అభివృద్ధి రాజధాని అమరావతి తప్ప మరొకటి కాదన్నారు. అలాగే అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టడానికి పోరాడిన సీఎం చంద్రబాబు దూరదృష్టి, పాలనాపరమైన అంకితం చాలా గొప్పదని ప్రశంసించారు. అమరావతి చట్టబద్ధత కోసం మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమించారని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు.

నవ్యాంధ్రకి అమరావతి అజరామరమైన గుర్తు

విభజన బాధల నుంచి ముందుకు వచ్చిన నవ్యాంధ్రకి అమరావతి అజరామరమైన గుర్తు ఈ రోజు అని ఎమ్మెల్యే శ్రావణి పేర్కొన్నారు. ఇది కేవలం నగరం కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం స్పష్టమైందని చెప్పారు. అమరావతి నుంచి ప్రపంచం వైపు అడుగులు వేయడానికి సమయం వచ్చేసిందన్నారు. ప్రజల స్పూర్తితో, రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని శాశ్వతంగా నిలుస్తుందన‌డంలో సందేహం లేదని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్పష్టం చేశారు.

గ్రహణం వీడింది.. విజయం జరుపుకుందాం: నారా లోకేశ్‌ పిలుపు

Next Story