Mahanadu: మహానాడులో టెక్నాలజీ వండర్.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన ఎన్టీఆర్

by Thanuru Gopichand |   (  Updated:2025-05-28 07:18:54  IST  )

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ ( ముందు వరుసలో ఉంటుందనేది మరోసారి రుజువైంది.

Mahanadu: మహానాడులో టెక్నాలజీ వండర్.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన ఎన్టీఆర్
X

దిశ, డైనమిక్​ బ్యూరో : సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)ముందు వరుసలో ఉంటుందనేది మరోసారి రుజువైంది. మహానాడు వేదికపై రెండోరోజు ఆర్టిఫిషియల్​ఇంటిలిజెన్స్​తో రూపొందించిన ఓ వీడియోను ప్రదర్శించడం ఇందుకు నిదర్శనం. కడప జిల్లాలో రెండో రోజు మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం నందమూరి తారక రామారావు (NTR) ఏఐ (AI) ప్రసంగాన్ని వేదికపై ప్రదర్శించారు. టీడీపీ ఆవి ర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు అందులో ఎన్టీఆర్ ప్రస్తావించారు. ‘మహా వేడుకలా.. నింగినేలా ఏకమై పరవశించేలా.. అంగరంగ వైభవంగా మహానాడు జరుగుతున్న వేళ పదికోట్ల మంది అన్నదమ్ములకు, ఆడపడుచులకు, రైతన్న లకు, శ్రమజీవులకు.. నా పసుపు జెండాను గుండెలపై మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు.. హృదయపూర్వక నమస్సుమాంజలి..’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేటి యువగళం, పీ4 కార్యక్రమాలను అందులో ఎన్టీఆర్​మాట్లాడినట్లుగా ప్రస్తావించారు. నా మనవడు లోకేశ్​అంటూ ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ వీడియోను ప్రదర్శించిన అనంతరం రూపకర్తలను చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రతి ఒక్కరూ ఏఐ టెక్నాలజీని (AI Techlology) అందిపుచ్చుకోవాలన్నారు.





Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక


Next Story