NTR: ఎన్టీఆర్‌ దార్శనికుడు : ప్రధాని మోదీ

by Thanuru Gopichand |   (  Updated:2025-05-28 04:54:10  IST  )

దివంగత నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అర్పించారు.

NTR: ఎన్టీఆర్‌ దార్శనికుడు : ప్రధాని మోదీ
X

దిశ, డైనమిక్​ బ్యూరో : దివంగత నందమూరి తారక రామారావు (Nandamuri Jubilee) జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) ఘనంగా నివాళి అర్పించారు.ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్​లో పోస్ట్​చేశారు. ఎన్టీఆర్​సినిమా రంగంలో విశిష్ట నటుడు అని తెలిపారు. మరోవైనపు దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. నందమూరి తారక రామారావు పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటూనే ఉంటున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ఎన్టీఆర్​నుంచి తాను ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందని ఆయన ట్వీట్​లో వివరించారు.

Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక

Next Story