లారీ అతివేగమే ప్రమాదానికి కారణం: NHAI అధికారి విద్యాసాగర్ రావు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-11 13:01:54  IST  )

హెవీ కాంక్రీట్ మిక్సర్ లారీ అతివేగం వల్ల కీసర టోల్ గేట్ వద్ద భారీ ప్రమాదం జరిగిందని అధికారి విద్యాసాగర్ రావు తెలిపారు. టోల్ గేట్ వద్ద లారీ పడటంతో కారు నుజ్జునుజ్జు అయిన ఘటనపై ఆయన స్పందించారు. ..

లారీ అతివేగమే ప్రమాదానికి కారణం: NHAI అధికారి విద్యాసాగర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: హెవీ కాంక్రీట్ మిక్సర్ లారీ(Lorry) అతివేగం వల్ల కీసర టోల్ గేట్(Keesara Toll Gate) వద్ద భారీ ప్రమాదం జరిగిందని NHAI అధికారి విద్యాసాగర్ రావు(NHAI officer Vidyasagar Rao) తెలిపారు. టోల్ గేట్ వద్ద లారీ పడటంతో కారు నుజ్జునుజ్జు అయిన ఘటనపై ఆయన స్పందించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండొచ్చని, ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని ఆయన తెలిపారు. టోల్ పాత్ నుంచి పక్కనే ఉన్న ఫ్లాట్ ఫారమ్‌పైకి లారీ ఎక్కిందని, దాని వల్ల ఓ పక్కకు ఒరిగిపోయి ఉంటుందని విద్యాసాగర్ రావు తెలిపారు. లారీ వెయిట్‌కు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండే హై అండ్ మోడల్ కారు నుజ్జు నుజ్జు అయిందని చెప్పారు. టోల్ గేట్ వద్ద కారు సక్రమంగానే వెళ్తోందని, కానీ దురదృష్టవశాత్తు అదుపు తప్పి లారీ పడిందని పేర్కొన్నారు. మరోవైపు కారు నెంబర్‌ను గుర్తించారు. అయితే ‘ఓనర్ ఎవరు..?. కారులో ఎంత మంది ఉన్నారు. అసలు వీళ్లు ఎవరు..?’ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కీసర టోల్ ప్లాజా వద్ద ఘోరం: హెవీ సిమెంట్ ట్యాంకర్ బోల్తా.. కారు నుజ్జునుజ్జు

Next Story