కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-27 12:01:36  IST  )

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది..

కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి...!
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu) ఇలాకలో 10 రోజుల క్రితం దారుణం జరిగింది. కుప్పం మండలం N.కొత్తపల్లి పంచాయతీ(Kuppam Mandal N.Kothapalli Panchayat)నిమ్మకంపల్లి గ్రామం(Nimmakampally village)లో వివాహితపై ముగ్గురు యువ‌కులు అత్యాచారానికి పాల్పడ్డారు. బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తామని దుండగులు బెదిరించారు. 10 రోజుల పాటు నరకయాతన అనుభవించిన వివాహిత.. తనను ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని భర్త మణికి చెప్పారు. దీంతో ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కుప్పం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి భర్త మణి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే కేసులో ఇప్పటివరకూ ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి భ‌ర్త మ‌ణి మాట్లాడుతూ విషయం బయటకు చెప్తే.. కుటుంబాన్ని అంతం చేస్తామని తన భార్యను నిందితులు బెదిరించారని తెలిపారు. జరిగిన ఘటనపై తన భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. తనను చంపేస్తామని, తన పిల్లలని చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి భ‌ర్త మ‌ణి డిమాండ్ చేశారు.

Read More..

దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Next Story