దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

by Kodari Anjali |

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో దారుణ హత్య కలకలం రేపింది.

దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
X

దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో దారుణ హత్య కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ శుక్రవారం అర్థరాత్రి దాటాక దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. అర్థరాత్రి సమయంలో గ్రామంలోని ఓ మహిళ ఇంటికి మహేందర్ వెళ్లినప్పుడు, అక్కడే ఉన్న వారు కర్రలతో దాడి చేసి అతడిని హతమార్చినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో నిందితులు ముందుగా మహేందర్ కళ్లలో కారం చల్లి, అనంతరం కర్రలతో విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Next Story