- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో సీఎం చంద్రబాబు ప్రచారం.. భంగం తప్పదని నారాయణ హెచ్చరిక
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడువెళ్లడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు...

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల ప్రచారం(Tamilnadu Election Campain)లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు(Telugu Desam Chief Chandrababu) వెళ్లడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(CPI National Secretary K. Narayana) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమిళ గడ్డపై డీఎంకే(Dmk), వామపక్షాల(Left) ఐక్యత ఎంతో పటిష్టంగా ఉందని, అక్కడ చంద్రబాబు పప్పులు ఉడకవని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడి తెలుగు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారికి అన్యాయం జరుగుతున్నా అప్పట్లో చంద్రబాబు ఏనాడూ నోరు మెదపలేదని నారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు కేవలం తన రాజకీయ స్వార్థం కోసం తమిళనాడు వెళ్లడం వల్ల ఆయనకు భంగపాటు తప్పదని హెచ్చరించారు.
ప్రధాని మోడీకి రాజకీయంగా ఆపద రావడం వల్లనే చంద్రబాబు ఇప్పుడు తమిళనాడులో ప్రచారం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కంటే మోడీని గెలిపించడమే లక్ష్యంగా చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. తమిళనాడు ఓటర్లు చైతన్యవంతులని, డీఎంకే కూటమిని విడదీయడం ఎవరితరం కాదని నారాయణ హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాట కూటమి విజయాన్ని ఆపలేరని, ఆయన పర్యటన కేవలం విఫల ప్రయత్నంగానే మిగిలిపోతుందని నారాయణ తేల్చి చెప్పారు.






