వారంతా తమిళ గడ్డ నుంచే వచ్చారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-20 09:28:12  IST  )

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలివి ద్రవిడ సంస్కృతేనని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పాండ్యులు, చోళులు పాలించిన నేల తమిళనాడు అని, అత్యంత ప్రాచీన భాష తమిళం అని ఆయన వ్యాఖ్యానించారు

వారంతా తమిళ గడ్డ నుంచే వచ్చారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాలివి ద్రవిడ సంస్కృతేనని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. పాండ్యులు, చోళులు పాలించిన నేల తమిళనాడు అని, అత్యంత ప్రాచీన భాష తమిళం అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు ఎన్నికల్లో(TamilNadu Elections) కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేస్తున్న వానతి శ్రీనివాసన్, కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్న అమ్మన్ కే. అర్జున్, సింగనల్లూర్ నుంచి పోటీ చేస్తున్న కేఆర్ జయరామన్, కౌండంబాలాయం నుంచి పోటీ చేస్తున్న అరుణ్ కుమార్, సూలూర్ నుంచి పోటీ చేస్తున్న కందస్వామికు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

తమిళులు ప్రేమించినంతగా...

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తల్లి భాషను తమిళులు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరన్నారు. కోయంబత్తూరు అత్యంత ప్రముఖ వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంమని, క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వమే తమిళ సోదరుల విజయరహస్య మని కొనియాడారు. ఏ రంగమైనా తమిళ సోదరులు విజయం సాధించారని గుర్తు చేశారు. సుబ్రమణ్య భారతి, కణ్ణగి, తిరువళ్లవర్, సీవీ రామన్ లాంటి ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డ నుంచే వచ్చారని, ఇక్కడ ఉన్నంత సుందరమైన పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇంకెక్కడా లేవన్నారు. రామేశ్వరం, తంజావూరు, అరుణాచలం లాంటి దివ్యక్షేత్రాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోడానికి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటినే ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.

తమిళనాడుతో మంచి సంబంధాలు..

‘‘తమిళనాడుతో తెలుగు వారికి మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ఈ గడ్డపై నుంచే ఎన్డీఆర్ ఎదిగి ఓ మహానాయకుడిగా ఎదిగారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. నా వివాహం కూడా చెన్నైలోనే అయ్యింది. తమిళనాడుకు నీటిని తీసుకురావడానికి ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చారు. నేను ప్రాతినిధ్యం వహించే కుప్పంలోనూ తమిళం మాట్లాడే వారే ఉన్నారు. జాతీయ రహదారులు అనుసంధానం అయినట్టే గంగ- కావేరి నదులు అనుసంధానం కావాలి. నీటి భద్రత వస్తే దేశానికి శ్రీరామ రక్ష అవుతుంది. ముందుగా రాష్ట్రాల్లో అంతర్గతంగా నదులు కలిపితే.. దేశంలో ఇతర నదుల అనుసంధానం జరుగుతుంది. గోదావరి- కావేరీ నదులు అనుసంధానమైతే ఆ తర్వాత క్రమంగా మిగతా నీటీ వనరులు కలిసే అవకాశం ఉంటుంది. శ్రీలంకలోనూ తమిళులు కాంగ్రెస్ కారణంగా ఇబ్బందులు పడ్డారు.’’ అని చంద్రబాబు తెలిపారు.

తమిళనాడులో సీఎం చంద్రబాబు ప్రచారం.. భంగం తప్పదని నారాయణ హెచ్చరిక

Next Story