- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ ఘాట్ పునరుద్ధరణపై నారా లోకేశ్ హర్షం
ఇది కదా పరస్పర స్నేహ భావం పెంచుకునే విధానం.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని (Hyderabad) ఎన్టీఆర్ ఘాట్‌ను (NTR Ghat) తెలంగాణ ప్రభుత్వం అత్యంత సుందరంగా పునరుద్ధరించడంపై ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఘాట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అవసరమైతే సొంత నిధులతో మరమ్మతులు చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హెచ్‌ఎండీఏ (HMDA) ద్వారా సుమారు రూ. 1.35 కోట్లతో మరమ్మత్తు పనులు చేపట్టింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తయి ఘాట్ కొత్త రూపు సంతరించుకోవడంతో లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హెచ్‌ఎండీఏ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని.. తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమని లోకేశ్ కొనియాడారు. ఆయన గౌరవార్థం నిర్మించిన ఈ స్మృతివనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తిదాయక ప్రదేశమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మహానాయకుడి వారసత్వాన్ని గౌరవిస్తూ, ఘాట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన తీరును ఆయన ప్రశంసించారు. అయితే తెలుగు జాతి సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను బాధ్యతగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
READ MORE .....






