- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయనకు ఆయనే సాటి.. ఆయనే పోటీ : దేవినేని ఉమా
తెలుగు ప్రజల గుండె చప్పుడు నందమూరి తారకరామారావు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి.. నట సార్వభౌమ ఎన్టీఆర్ (NTR) ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఆయనే పోటీ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడిలోని కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. నటన నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహనీయుడని వివరించారు. ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ కు మాత్రమే దక్కిన అరుదైన వరం అని పొగిడారు.
రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహా నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. పేదవాడి ఆకలి తీర్చడానికి రెండు రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. సంక్షేమ రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన కృషి నేటికీ అనేక పథకాలకు దిక్సూచిగా నిలుస్తోందన్నారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనలో సాగడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.
READ MORE .....






