- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుషికొండకు జగన్ గుండు కొట్టారు.. Nara Lokesh
సీఎం జగన్ రుషికొండకి గుండు కొడితే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండవల్లి కొండను మింగేశారని నారా లోకేశ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుషికొండకి గుండు కొడితే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండను మింగేశారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సహజ వనరుల దోపిడీలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఇంటికి కూత వేటు దూరంలో యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోంది ఆళ్ల మైనింగ్ మాఫియా అని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.
ఉండవల్లి కొండను మాయం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి కొండపై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టీడీపీ నాయకులని, కార్యకర్తల్ని లోకేశ్ అభినందించారు. ఈ సందర్భంగా కొండ వద్ద పోరాటం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
త్వరలో ఛలో విజయవాడ.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు






