త్వరలో ఛలో విజయవాడ.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

by Dishafeatures2 |
త్వరలో ఛలో విజయవాడ..  ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రెజరీ ద్వారా మాత్రమే తమకు పేమెంట్స్ జరగాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి మలి విడత ఉద్యమం చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పలు జిల్లాలలో జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా తిరుపతి కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ధర్నాలో వందలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఛలో విజయవాడ వంటి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాలను ఇబ్బందులు పాలు చేసి దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల మధ్య ఐక్యత ఉందని.. ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పోరాడాలని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. నాయకుల తీరు ఎలా ఉన్నా సంఘాలకు అతీతంగా ఉద్యోగులు కదిలి వస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని, ఎంత ఇవ్వాలో లెక్క కూడా చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమ ఉద్యమంపై మంత్రులు అవహేళన చేయడం ద్వారా ఉద్యోగుల్లో మరింత కసి పెరుగుతోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: రుషికొండకు జగన్ గుండు కొట్టారు.. Nara Lokesh


Next Story