- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nandyal | లారీ.. ప్రైవేటు బస్సు ఢీ.. ఇద్దరు మృతి
నంద్యాల జిల్లా (Nandyal District) ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లా (Nandyal District) ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లెమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందున్న లారీనీ ఢీకొట్టింది. దాని వెనుకే వస్తున్న మరో లారీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో వెనుక వైపు కూర్చొని ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీనా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుక్కుపోయిన లారీ డ్రైవరును బయటకు లాగారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ఉన్నట్లుగా సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు.
Read More..






