- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిగజారి మాట్లాడొద్దు.. చట్టం చూస్తూ ఊరుకోదు: మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్
మాజీ మంత్రి జోగి రమేశ్‌పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh)పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Mailavaram Mla Vasantha Krishna Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)పై ఆయన చేస్తున్న ఘాటు విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జోగి రమేశ్ పవర్తన మితిమీరిందని, లోకేశ్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చింది టీడీపీనేనని చెప్పారు. వ్యవస్థలను జోగి రమేశ్ లెక్కచేయడంలేదన్నారు. దిగజారి అసభ్య చేస్తే చట్టం చూస్తూ ఉండదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకే గతంలో జోగి రమేశ్‌కు జగన్ మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. మళ్లీ అందలం వస్తుందనే ఉద్దేశంతోనే అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఇంటిప జోగి రమేశ్ చేసిన దాడి గుర్తులేదా? అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు.






