నాకేమైనా జరిగితే ఆయనే కారణం: జోగి రమేశ్ సెన్సేనల్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-02 11:53:36  IST  )

తనకు ప్రాణ హాని ఉందని, ఏదైనా జరిగితే ఆయనే కారణమని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు..

నాకేమైనా జరిగితే ఆయనే కారణం: జోగి రమేశ్ సెన్సేనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తనకు ప్రాణ హాని ఉందని, ఏదైనా జరిగితే ఆయనే కారణమని మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) అన్నారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జోగి రమేశ్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టిన భపడేదేలేదన్నారు. తన ఇంటిపై దాడి చేసి తనపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ ప్రవర్తనలో మార్పు రాకపోతే ప్రజలు తిరగబతారని హెచ్చరించారు. అరెస్ట్ చేసినా అందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 83 రోజులు జైల్లో పెట్టినా చంద్రబాబు కడుపు చల్లారలేదా అని ప్రశ్నించారు. తమను వేధించి రాక్షసానందం పొందుతారా అని నిలదీశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై తాము మాట్లాడితే బడుగు బలహీన వర్గాలైన తమపై దాడి చేశారని జోగి రమేశ్ మండిపడ్డారు. తన ఇంటికి ఎంతదూరమో.. లోకేశ్ ఇంటికి కూడా అంతేదూరమన్న విషయం గుర్తుంచుకోవాలని జోగి రమేశ్ హెచ్చరించారు. తనపై ఎలాంటి దాడి జరిగినా అందుకే లోకేశే కారణమన్నారు. తనకు అండగా జగనన్న, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారని జోగి రమేశ్ పేర్కొన్నారు.

దిగజారి మాట్లాడొద్దు.. చట్టం చూస్తూ ఊరుకోదు: మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్

Next Story