మున్సిపల్ శాఖలో కీలక పరిణామం.. పలువురు కమిషనర్లకు బదిలీలు, పోస్టింగ్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-26 11:46:47  IST  )

రాష్ట్రంలో పలువురు కమిషనర్లకు బదిలీలతో పాటు పోస్టింగ్స్ సైతం కల్పించారు...

మున్సిపల్ శాఖలో కీలక పరిణామం.. పలువురు కమిషనర్లకు బదిలీలు, పోస్టింగ్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 11 మంది మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ బదిలీ చేయడంతో పోస్టింగులు సైతం కల్పించారు. కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా పి. శ్రీధర్‌ను నియమించారు. అంతేకాదు ప్రస్తుతమున్న కమిషనర్ పి. కృష్ణ మోహన్ రెడ్డిని జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. అనంతపురం డిప్యూటీ కమిషనర్ గా ఎం. అంజయ్యను, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా డి.పావనికి పోస్టింగ్ కల్పిస్తూ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More..

TG: రైతుభరోసా పథకం నిలిపివేత అంటూ ప్రచారం.. క్లారిటీ

Next Story