సిట్ నివేదికను జీర్ణించుకోలేకనే.. ఇదంతా!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-05 12:14:59  IST  )

శ్రీవారి లడ్డూ నెయ్యి వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడుపై ఎంపీ గురుమూర్తి విమర్శలు చేశారు...

సిట్ నివేదికను జీర్ణించుకోలేకనే.. ఇదంతా!
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ నెయ్యి వ్యవహారం(Sri Vari Laddu Ghee)లో సిట్ నివేదికను సీఎం చంద్రబాబు(Cm Chandrababu) జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి(Ycp Mp Gurumurthy) విమర్శించారు. తిరుమల లడ్డూ నెయ్యి ఘటనలో చర్యలు తీసుకోవాలని సిట్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ గురుమూర్తు మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవకపోయినా సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన తప్పును తమ ప్రభుత్వంపై నెడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు బ్యాక్ డోర్ ద్వారా కల్తీ నెయ్యిని వినియోగించారని ఆరోపించారు. జనవరి నుంచి టీటీడీపై ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామినే బుద్ధి చెబుతారని ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు.

వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవరినీ వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు వార్నింగ్

Next Story