వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవరినీ వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-05 12:15:07  IST  )

రామతీర్థంలో రాముడి తల తీసేశారని ప్రశ్నిస్తే వైసీపీ హయాంలో తమపై కేసు పెట్టారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు..

వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవరినీ వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రామతీర్థం(Ramatirtha)లో రాముడి తల తీసేశారని ప్రశ్నిస్తే వైసీపీ(Ycp) హయాంలో తమపై కేసు పెట్టారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(Madhav)తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ లడ్డూ కల్తీ ప్రజల మనోభావాలకు ముడిపడిన అంశమని ఆయన చెప్పారు. శ్రీవారి తమ ఇంటి కులదైవమని, 2003లో తన హత్యాయత్నం జరిగితే ఆయనే బతికించారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి తమల్ని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నించారు. తమను బూతులు తిట్టి సెలైంట్‌గా ఉండమంటున్నారని మండిపడ్డారు. నెయ్యి కల్తీపై వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. తిరుమల నెయ్యి కల్తీపై అన్ని రిపోర్టులను ప్రజల ముందు పెడతామని, తప్పు చేసిన వారిని వదలిపెట్టే సమస్యలేదని చంద్రబాబు హెచ్చరించారు.

తిరుమలకు భక్తుల రావాలంటే అనుమానించే పరిస్థితి

జగన్ హయాంలో తిరుమలకు భక్తుల రావాలంటే అనుమానించే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. అప్పుడు దుర్మార్గంగా వ్యవహరించి ఇప్పుడు తమ ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామన్నారు. దోషులను వదిలిపెట్టమని, శిక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీట్ అందిన తర్వాత అవసరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. జగన్ అన్యమతస్తుడు కావొచ్చు గాని, తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకుంటే సరిపోతుందని చంద్రబాబు తెలిపారు. దేవుడి పవిత్రతను కాపాడలేనంద అసమర్థులమైతే కాదన్నారు. మాజీ మంత్రి, సొంత బాబాయ్ వివేకను హత్య చేసి కత్తి నా చేతిలో పెట్టారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు నాతోనే కాదని, దేవుడితో పెట్టుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌కు శ్రీవారిపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

Read More... భగవంతుడిపై Ycp పగబట్టింది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Next Story