భగవంతుడిపై Ycp పగబట్టింది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-05 08:38:09  IST  )

భగవంతుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పగబట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు...

భగవంతుడిపై Ycp పగబట్టింది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భగవంతుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party) పగబట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఆరోపించారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (Bjp State Chief Madhav)భేటీ అయిన ఆయన కీలక విషయాలపై చర్చించారు. హిందువులందరూ తిరుమల(Tirumala)ను ఏడు కొండలు అని అంటామని, కానీ వాళ్లు రెండు కొండలు అని అంటారని ఆయన తెలిపారు. లడ్డూ నెయ్యిలో బీఫ్, పంది కొవ్వు, ఫిష్ అయిల్ ఉందని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిందని, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు చదవి వినిపించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ అంశంపై చర్చించిన తర్వాతనే తాము మాట్లాడని తెలిపారు. పర్యవసానాలు ఆలోచించిన తర్వాతనే తాము మాట్లాడామని పవన్ పేర్కొన్నారు.

ఐదేళ్లు అధికారం మాదే..

ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, అలాంటిది రాజకీయ లబ్ధికోసం మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. కల్తీ నెయ్యితో అయోధ్యకు లక్ష లడ్డూలు పంపారని, 59 లక్షల కేజీల నెయ్యి కాదని, దాన్ని కల్తీ పామాయిల్ అనాలని పవన్ వ్యాఖ్యానించారు. భోలేబాబా డెయిరీ 58 లక్షల కేజీల పామాయిల్, లక్ష కిలోల రసాయనాలు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో హిందూమతంపై చాలా దాడులు జరిగాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

Read More... వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవరినీ వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు వార్నింగ్

Next Story