ముదురుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. మరో వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-29 08:07:54  IST  )

జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ‌శ్రీధ‌ర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన బాధితురాలు వీణ మ‌రో వీడియోను విడుద‌ల చేసింది.

ముదురుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. మరో వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ‌శ్రీధ‌ర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన బాధితురాలు వీణ మ‌రో వీడియోను విడుద‌ల చేసింది. మీడియా స‌మావేశంలో తాను కొంత ఇబ్బందిప‌డిన‌ట్టు చెప్పారు. త‌న‌కు మీడియా స‌మావేశం కొత్త అని ఒకేసారి అంద‌రూ త‌న‌మీద ప‌డిపోయార‌ని అన్నారు. ప్రెస్ మీట్ అంటే ఒక‌రి త‌ర‌వాత మ‌రొక‌రు ప్ర‌శ్నించార‌ని కానీ అంద‌రూ ఒకేసారి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారని అన్నారు. ఐల‌వ్ యూ అంటే అర్థం ఏంటి అంటూ ఒక‌రి బాధ‌ను ఎగ‌తాలి చేస్తే ఎవ‌రైనా ఫ్ర‌స్టేట్ అవుతారన్నారు. తాను ఎవ‌రినీ రూ.25 కోట్లు అడ‌గ‌లేద‌ని అడ‌గ‌ను కూడా అని చెప్పారు.

తాను మాట్లాడి ఉంటే పూర్తి ఆడియోను బ‌య‌ట‌పెట్టాల‌ని 24 సెక‌న్ల ఆడియో పెట్టుకుని ఇది పూర్తి ఆడియో అంటే తాను అంగీక‌రించ‌ను అని చెప్పారు. తాను తాతంశెట్టి గురించి పూర్తి ఆడియో బ‌య‌ట పెట్టాల‌ని త‌న ఆడియోలు కూడా అలా ఉంటే బ‌య‌ట‌పెట్టాల‌ని చెప్పింది. జ‌ర్న‌లిజం విలువ‌ల‌తో ఉంటే త‌న‌ను మీడియా స‌మావేశంలో అలా టీజింగ్ చేయ‌రు అని చెప్పింది. మీడియా వాళ్లు పిలిచి టీజింగ్ చేస్తే ఏం చేయాలో త‌న‌కు తెలుసుని త‌న‌కు కూడా చ‌ట్టం తెలుస‌ని చెప్పింది. త‌న‌ను ప్ర‌శ్నించిన‌ట్టే ఎమ్మెల్యేను కూడా ప్ర‌శ్నించాల‌ని చెప్పింది. క‌మిటీ వేశార‌ని అన్ని నిజానిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించింది. నిజానిజాలు తెలుసుకుని మీడియా వాళ్లు ప్ర‌శ్నించాల‌ని చెప్పింది.

MORE NEWS : అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్

Next Story