- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై వీడియో సందేశం ద్వారా స్పందించిన అరవ శ్రీధర్ అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై వీడియో సందేశం ద్వారా స్పందించిన అరవ శ్రీధర్ అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినట్టు తెలుస్తోంది. న్యాయవాదుల సలహా తరవాత ఆయన బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారణకు పిలవాలని జనసేన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన వీడియోలో శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర నుండి తనపై కుట్ర జరిగిందని చెప్పారు. ఆరు నెలల నుండి వీణ తనను వేధిస్తోందని శ్రీధర్ చెప్పారు.
వేధింపుల నేపథ్యంలో తన తల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి గతంలో ఫిర్యాదు చేసిందని అన్నారు. వీణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు వీణ తనను శ్రీధర్ లైంగికంగా వాడుకుని మోసం చేశాడని ఆరోపిస్తోంది. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించాడని చెబుతోంది. శ్రీధర్ వల్లనే తన భర్తకు విడాకులు ఇచ్చానని చెబుతోంది. ఆరోపణలు మాత్రమే కాకుండా శ్రీధర్ తో వీడియో కాల్స్ మాట్లాడగావ వాటిని లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే దీనిపై జనసేన పార్టీ విచారణకు సైతం ఆదేశించింది.






