- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: సుదీర్ఘ చర్చ.. వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో.. మంత్రులంతా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కొన్నాళ్లపాటు మంత్రులంతా విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. అలాగే వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదా ఈవీ వెహికల్స్, సైకిల్స్ వాడాలని సూచించిందని వివరించారు. అలాగే జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, వీలైనంత వరకూ మీటింగ్స్ వర్చువల్ గా నిర్వహించుకోవాలని తెలిపింది. అలాగే ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేని ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంపై తీవ్ర ప్రభావం ఉందని, ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించామన్నారు. ప్రతి ఒక్కరూ నా దేశం, నా బాధ్యత అనే విధంగా వ్యవహరించాలని కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయన్నారు.
విద్యుత్ వినియోగాన్ని కూడా వీలైనంతవరకూ తగ్గించుకోవాలని సమావేశంలో చర్చించామని మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల టెంపరేచర్ ను 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలోనూ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది. ఎక్కువగా సోలార్ ఎనర్జీనే వినియోగించుకోవాలని తెలిపింది. మంత్రుల నుంచి అధికారుల వరకూ వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది.






