సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఉబర్‌ ప్రతినిధుల భేటీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-14 12:58:04  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు గురువారం ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఉబర్‌ ప్రతినిధుల భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు గురువారం ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉబర్ సీఈఓ దాదా ఖుస్రోషాహీ నేతృత్వంలోని టీమ్ తో టెక్నాలజీ, మొబిలటీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై లోతుగా చర్చించారు. అలాగే పట్టణ రవాణా వ్యవస్థ వంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ప్రపంచస్థాయి నాయకులతో ఆలోచనలు పంచుకోవడం ఎప్పుడూ ఉత్తేజాన్ని ఇస్తుందని లోకేష్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలాంటి ప్రపంచస్థాయి నాయకులతో ఆలోచనలను పంచుకోవడం నూతన ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని టెక్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అత్యాధునిక రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ఉబర్ వంటి గ్లోబల్ ప్లాట్ ఫామ్ లలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ సమావేశంగా కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించే విషయాలపై చర్చించారు.

BREAKING: సుదీర్ఘ చర్చ.. వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

Next Story