- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలికిపురం గ్యాస్ లీకేజీపై మంత్రుల ఆరా.. అధికారులకు కీలక సూచనలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ అయింది. గ్యాస్ పైపు నుండి దట్టంగా పొగ రూపంలో గ్యాస్ బయటకు వచ్చింది. పొగతో పాటు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ అయింది. గ్యాస్ పైపు నుండి దట్టంగా పొగ రూపంలో గ్యాస్ బయటకు వచ్చింది. పొగతో పాటు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో గ్రామస్తులు ఇళ్ల నుండి బయటకు వచ్చి పరుగులు తీశారు. కాగా తాజాగా ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, కార్మికశాఖ మంత్రి సుభాష్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంట ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే ఓఎన్జీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మంటలను అదుపులోకి తెచ్చేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Read More... ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా.. ఇరుసుమండ గ్రామం ఖాళీ






