అడ్డంగా దొరికిపోయి.. దొంగ ప్రమాణాలా: జోగి రమేశ్‌పై మంత్రి ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-26 10:51:08  IST  )

కల్తీ మద్యం కేసులో దొరికిపోయి దొంగ ప్రమాణాలు చేస్తే ఎలా అని మాజీ మంత్రి జోగి రమేశ్‌‌ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు....

అడ్డంగా దొరికిపోయి.. దొంగ ప్రమాణాలా: జోగి రమేశ్‌పై మంత్రి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: కల్తీ మద్యం కేసు(Fake Liquor Case)లో దొరికిపోయి దొంగ ప్రమాణాలు చేస్తే ఎలా అని మాజీ మంత్రి జోగి రమేశ్‌(Former Cm Jogi Ramesh)ను మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister VasamSetty Subash) ప్రశ్నించారు. కల్తీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలయి ఏ ప్రమాణానికైనా సిద్ధమేనన్న జోగి రమేశ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మంత్రి అయి ఉండి జోగి రమేశ్ వీధి రౌడీలా వ్యవహరించారని మండిపడ్డారు. కల్తీ మద్యంతో పాటు అగ్రిగోల్డ్ కేసులోనూ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీ వార్డు వాడితే అమాయకుడై పోతాడా అని నిలదీశారు. వైసీపీ చేసిన పాపాలకు ఆ పార్టీని దేవుడు 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. జోగి రమేశ్ 83 రోజల పాటు జైలులు ఉన్నారని, 8, 3ని కూడితే 11 అవుతుందని మంత్రి వాసం శెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. బీసీ కార్డు వాడినంత మాత్రనా చేసిన తప్పులు చెరిగిపోతాయా అని వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు.

READ MORE .....

కాపులకు అన్యాయం చేశారు: మంత్రిపై తోట త్రిమూర్తులు ఫైర్

Next Story