- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాపులకు అన్యాయం చేశారు: మంత్రిపై తోట త్రిమూర్తులు ఫైర్
కాపులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆరోపించారు..

దిశ, వెబ్ డెస్క్: కాపులకు మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamsetty Subhash) అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు(Former MLA Thota Trimurthulu) ఆరోపించారు. కాపు ఓట్లతో గెలిచినట్లు చెప్పుకున్న వాసంశెట్టి మరి ఆ సంఘానికి చెందిన స్థలాన్ని 22ఏలో ఎలా పెట్టారని ఆయన ప్రశ్నించారు. కాపు కల్యాణ మండపాల స్థలాలను కబ్జా చేశామని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆర్టీసీ స్థలాన్ని కబ్బా చేశారని, మరి ఇప్పుడెందుకు స్వాధీనం చేసుకోలేదని తోట త్రిమూర్తులు నిలదీశారు. 2002లో కాపు కల్యాణ మండపం నిర్మాణానికి దేవాదాయ శాఖకు చెందిన 1.40 ఎకరాల భూమిని అప్పట్లో రూ. 4లక్షలకు వేలంలో అందరి సహకాంతో తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సొంత సొమ్ములతో ఆ స్థలాన్ని కొనుగోలు చేసినా ఇప్పటి వరకూ నిర్మాణాలు జరగలేదని చెప్పారు. అయితే వేరే స్థలం కొని అక్కడ కల్యాణ మండపం నిర్మాణం చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. అన్నాయిపేటలో ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెడితే మంత్రి వాసంశెట్టి సుభాష్ రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తోట త్రిమూర్తులు ఆరోపించారు.
READ MORE .....






