- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Savitha: ఖబడ్దార్ అంబటి..మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు
జగన్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి, అంబటి రాంబాబు చాలా అరాచకాలు చేశారని నిప్పులు చెరిగారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలోనూ రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు మంత్రి సవిత.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ పై ఏపీ మంత్రి సవిత స్పందించారు. ఖబడ్దార్ అంబటి రాంబాబు.. మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరించారు సవిత.తక్షణమే సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలంటే గౌరవం ఇవ్వని అంబటి రాంబాబు, సీఎం చంద్రబాబును తిట్టడం ఏంటని నిలదీశారు. ఏపీ కోసం నిత్యం పని చేస్తోన్న సీఎం చంద్రబాబును బూతులు తిట్టడం అన్యాయమన్నారు.
జగన్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి, అంబటి రాంబాబు చాలా అరాచకాలు చేశారని నిప్పులు చెరిగారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలోనూ రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు మంత్రి సవిత. కాగా, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరుణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరులోని ఆయన నివాసంలో రాంబాబుని అరెస్ట్ చేసిన పోలీసులు... భారీ భద్రత మధ్య నల్లపాడు పీఎస్ కి తరలించారని అంటున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై రాళ్ల దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కార్యకర్తల దాడిలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయట.
Read More..






