- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబటి రాంబాబు ఇంటికి నిప్పు !
అంబటి ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారని వైసీపీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అంబటికి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాసేపటి క్రితం అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అనంతరం అంబటి ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారని వైసీపీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగి, మంటలు ఆర్పినట్లు తెలుస్తోంది. చిన్నపాటి ఫైర్ కావడంతో వెంటనే పోలీసులు ఆర్పేశారు.
లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ సంఘటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర అర్ధరాత్రి అయినా, హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే గుంటూరులోని ఆయన నివాసంలో రాంబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం అంబటి రాంబాబును భారీ భద్రత మధ్య నల్లపాడు పీఎస్ కు తరలించారు. ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తాజాగా అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలోనే అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు.
Read More..
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్






