లోకేశ్‌కి ఆ పదవి తప్పనిసరి..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-28 06:40:00  IST  )

పార్టీ బలోపేతం కావాలంటే నారా లోకేశ్ (Nara Lokesh)కు వర్కింగ్​ప్రెసిడెంట్​ఇవ్వాలనేది సహేతుకమైన నిర్ణయం అని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ​అభిప్రయాపడ్డారు.

లోకేశ్‌కి ఆ పదవి తప్పనిసరి..
X
  • అదే కార్యకర్తల డిమాండ్​
  • మంత్రి పయ్యావుల కేశవ్​

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ బలోపేతం కావాలంటే నారా లోకేశ్ (Nara Lokesh)కు వర్కింగ్​ప్రెసిడెంట్​ఇవ్వాలనేది సహేతుకమైన నిర్ణయం అని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ​అభిప్రయాపడ్డారు. ఈ రోజు మహానాడు (TDP Mahanadu) ప్రాంగణం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యకర్తలతో పాటు నేతలంతా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. లోకేశ్​వర్కింగ్​ప్రెసిడెంట్ కావాలన్నది నీడ్​ఆఫ్​ద అవర్​అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఏమి జరిగినా డెమోక్రటిక్​గా జరుగుతుందన్నారు. ఈ డిమాండ్​కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున వస్తుందన్నారు. రాష్ట్రాన్ని గత పార్టీ చేసిన విధ్వంసం నుంచి అభివృద్ధివైపు తీసుకు వెళ్లడానికి చంద్రబాబు నిరంతరం పనిచేయాల్సి వస్తుందన్నారు. ఈ కీలక తరుణంలో లోకేశ్​వర్కింగ్​ప్రెసిడెంట్​గా వస్తే పార్టీకి మరింత చైతన్యం వస్తుందని తెలిపారు.

Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక


Next Story