మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు: వైసీపీ నేతలపై లోకేశ్ ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-09 12:13:09  IST  )

మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు అంటూ వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు..

మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు: వైసీపీ నేతలపై లోకేశ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు అంటూ వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఫైర్ అయ్యారు. సాక్షిలో అమరావతి(Amaravati) మహిళను కించపర్చిన నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సాక్షి జర్నలిస్టు శ్రీనివాసరావు(Sakshi Journalist Srinivasarao)ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తమను కించపర్చారంటూ అమరావతి మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ(Ycp) నేతల సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) విరుకుపడ్డారు. వారిని అమనించేలా వ్యా్ఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు.

‘‘తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా?. ఏమిటీ ఈ భాష?. ఏమిటీ విపరీత ప్రవర్తన?. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడతారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు!. జగన్ రెడ్డి తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం.’’ అని లోకేశ్ హెచ్చరించారు.

Sajjala Ramakrishna Reddy : అమరావతి మహిళలు సంకర తెగ : సజ్జల రామకృష్ణా రెడ్డి

Next Story