- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sajjala Ramakrishna Reddy : అమరావతి మహిళలు సంకర తెగ : సజ్జల రామకృష్ణా రెడ్డి
అమరావతి మహిళల(Amaravathi Women)పై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు(Journalist Kommineni Srinivasa Rao) చేసిన అనుచిత వ్యాఖ్యలు మరవకముందే.. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) కూడా మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి మహిళల(Amaravathi Women)పై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు(Journalist Kommineni Srinivasa Rao) చేసిన అనుచిత వ్యాఖ్యలు మరవకముందే.. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) కూడా మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడలో భారీ సంఖ్యలో మహిళలు సాక్షి పత్రిక ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. అయితే సాక్షి ఆఫీసు ముందు నిరసనకు దిగి, ఆఫీసును ధ్వంసం చేసినందుకు గాను సజ్జల రామకృష్ణా రెడ్డి వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు.
ఆందోళన చేస్తున్న మహిళలు సంకర తెగ అంటూ మండిపడ్డారు. వారంతా పిశాచాలు, రాక్షసులు అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. కాగా సజ్జల వ్యాఖ్యలపై రాజధాని మహిళలు మరోసారి భగ్గుమన్నారు. సజ్జలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఏపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు: వైసీపీ నేతలపై లోకేశ్ ఫైర్






