- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలిని కలుస్తా.. కోవా బన్ తింటా.. నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు
మేడారం కోవా బన్ ఘటనపై ఏపీ మంత్రి నారాలోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన లోకేష్.. సోదరుడు వలిని వేధిస్తున్నప్పుడు భరించాల్సివచ్చినందుకు తాను చాలా బాధపడుతున్నానని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన మేడారం జాతరలో మీడియా పేరు చెప్పుకుని ఓ వ్యక్తి కోవా బన్ అమ్మే చిరు వ్యాపారి వలిని ఇబ్బందిపెట్టిన సంగతి తెలిసిందే. కోవా బన్ ఎక్స్ పైరీ డేట్ చూపించాలని, చెట్టుకు కట్టేస్తామని వలిపై బెదిరింరిపులకు పాల్పడ్డాడు. మరికొందరితో కలిసి ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అయింది. వలితో బలవంతంగా కోవా బన్ తినిపించడం.. చుట్టూ అంతమంది చేరి ఇబ్బంది పెట్టడంతో ఆతడు ఆందోళన చెందడం చూసి నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు.
ఈ ఘటన సోషల్ మీడియాను షేక్ చేయగా తాజాగా దీనిపై ఏపీ మంత్రి నారాలోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన లోకేష్.. సోదరుడు వలిని వేధిస్తున్నప్పుడు భరించాల్సివచ్చినందుకు తాను చాలా బాధపడుతున్నానని తెలిపారు. ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం మరియు సోదరభావం కోసం నిలబడే తెలుగు సమాజంలో ఇలాంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు స్థానం లేదన్నారు. త్వరలోనే వలిని కలుస్తానని.. ఎంతో ప్రసిద్ధి చెందిన భోవా బన్ రుచి చూడగటానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. మేమంతా కలిసి నిలబడతామని లోకేష్ పేర్కొన్నారు.






