- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీపై మొంథా తుపాను ఎఫెక్ట్.. రేషన్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఏపీపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు..

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా మిగతా షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీపై కీలక ప్రకటన చేశారు. 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
తుపాన్ కారణంగా మూడురోజులు ముందుగానే రేషన్ సరుకులు అందించనున్నట్లు వెల్లడించారు. 7 లక్షల మంది రేషన్ కార్డు దారులకు సరుకులు పంపిణీ చేయడంతో పాటు.. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూస్తామని తెలిపారు.
Read More..
Next Story






