- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మొంథా’ సైక్లోన్ ఎఫెక్ట్.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం
‘మొంథా’ తుపాను తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘మొంథా’ తుపాను తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెన్నె (Chennai) నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్ జగడే (Collector Rashmi Siddharth Jagade) మంగళవారం నగరంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక తిరువళ్లూరు (Thiruvallur) జిల్లాలోని పాఠశాలలు కూడా మూసివేయనున్నట్లుగా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) ప్రకారం.. చెన్నై, రాణిపేట్, తిరువళ్లూరు, కాంచీపురం సహా నాలుగు ఉత్తర జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. మొంథా సైక్లోన్ ఉత్తర-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మచిలీపట్నం, కాళింగపట్నం మధ్య కాకినాడ జిల్లా సమీపంలో తీరం దాటనుందని ప్రజలకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు RMC డైరెక్టర్ బి.అముద వెల్లడించారు.
Read More..
బలపడుతోన్న ‘మొంథా’ తుపాన్.. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక
ఏపీపై మొంథా తుపాను ఎఫెక్ట్.. రేషన్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన






