బలపడుతోన్న ‘మొంథా’ తుపాన్.. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-28 03:44:34  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా సైక్లోన్ ఉత్తర - వాయవ్య దిశగా దిశగా కదులుతూ మచిలీపట్నం, కాళింగపట్నం మధ్య కాకినాడ జిల్లా సమీపంలో తీరం దాటనుందని ప్రజలకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

బలపడుతోన్న ‘మొంథా’ తుపాన్.. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా సైక్లోన్ ఉత్తర - వాయవ్య దిశగా దిశగా కదులుతూ మచిలీపట్నం, కాళింగపట్నం మధ్య కాకినాడ జిల్లా సమీపంలో తీరం దాటనుందని ప్రజలకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. మరోవైపు తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.

Read More..

‘మొంథా’ సైక్లోన్ ఎఫెక్ట్‌.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

Next Story