మహిళగా సిగ్గుతో తలదించుకున్నా: మంత్రి సంధ్యారాణి భావోద్వేగం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-23 09:07:59  IST  )

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు...

మహిళగా సిగ్గుతో తలదించుకున్నా: మంత్రి సంధ్యారాణి భావోద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(MLC Anantha Babu's driver Subramaniam murder case)పై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Minister Gummidi Sandhyarani) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతబాబు దగ్గర పని చేసిన డ్రైవర్‌ను చంపి డోర్ డెలీవరి చేశారని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్సీగా అనంతబాబు తమతో పాటు కౌన్సిల్‌కు వస్తుంటే ఓ మహిళగా తలదించుకుని సిగ్గుపడ్డామని సంధ్యారాణి వ్యాఖ్యానించారు. డ్రైవర్ ను చంపిన వ్యక్తి కౌన్సిల్ కు వచ్చి చట్టాలు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. సభ్యసమాజానికి నీతులు చెబుతారా..? అని నిలదీశారు. ఇంత చేసిన అనంతబాబును జగన్ చూస్తూ ఉన్నారంటే ఉద్దేశమేంటని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు.

ఎంత దారుణం..

‘‘ఎవరినైనా సరే చంపు.. దోచుకో..దాచుకో.. ఇదే తమ సిద్ధాంతం, మనది గొడ్డలి పార్టీ అని చెప్పటమా.. జగన్?’’ అని సంధ్యారాణి నిలదీశారు. మనిషి చంపి గత ఐదేళ్లుగా పోలీసులు సీసీ ఫుటేజులు బయటకు తీయలేదంటే ఎంత దారుణం. పోలీసులపై ఎంత ప్రేజర్ చేశారో అర్ధమవుతోంది. మనుషులను గుర్తు పట్టకుండా ఒకటో, రెండో చీకట్లో ఉన్న సీసీ ఫుటేజులను తీశారు. అదే పోలీసులు ఈ రోజు 60 సీసీ టీవీ ఫుటేజులు తీసుకొచ్చారు. ఎంత ధైర్యం ఉంటే మనిషి చంపి డోర్ డెలివరీ చేస్తారు..?. ఇది బరితెగింపు కదా.?. సొంత బాబాయ్‌ను చంపి గుండెపోటు వచ్చిందని ప్రచారం చేశారు. గుండెపోటు పేరు చెప్పి రక్తం తుడిచారు. ప్యాక్ చేసి శవయాత్ర చేశారు. చివరి వివేకా భార్య గుర్తు పట్టడంతో హత్య అనే విషయం బయటకు వచ్చింది. దీంతో చంద్రబాబునే చంపారు అని మరో ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు సొంత తల్లి, చెల్లెళ్లే చెబుతున్నారు.. వివేకాను చంపించింది జగనేనని’’ అని మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యానించారు.

సొంత వారినీ చంపేస్తున్నారు: వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత తీవ్ర విమర్శలు

Next Story