సొంత వారినీ చంపేస్తున్నారు: వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-23 08:51:48  IST  )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిల్లర్ పార్టీ అని, ఆ పార్టీలోని కొందరు నాయకులు సొంత వాళ్లనూ చంపేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు...

సొంత వారినీ చంపేస్తున్నారు: వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) కిల్లర్ పార్టీ అని, ఆ పార్టీలోని కొందరు నాయకులు సొంత వాళ్లనూ చంపేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకానందారెడ్డి(Ys Vivekananda Reddy), వైసీపీ నేత పెద్ద దస్తగిరి(Ycp Leader Pedda Dastagiri) హత్యలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే చంపేస్తారని, ఆ తర్వాత కూడా పరామర్శలు కూడా వాళ్లే చేస్తారని తెలిపారు. నేరస్తులైన ప్రతిపక్ష నాయకులతో తాను రాజకీయాలు చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

హత్యారాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోంది..

అనకాపల్లి మండలం రాంబిల్లి(Rambilli) సభలో చంద్రబాబు ప్రసంగించారు. సొంతపార్టీ నేతలను చంపే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో హత్యారాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు(Mlc Ananthababu) హత్య చేసి డోర్ డెలివరీ చేశారని, అంతేకాకుండా సాక్షులను సైతం డబ్బులిచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇవి పాత రోజులుకావని, తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత తీవ్ర విమర్శలు

Next Story