- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత తీవ్ర విమర్శలు
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు నిందితులను వదిలేది లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. వైసీపీ హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, వైసీపీ ఒక హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని ఆమె అభివర్ణించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 'సైకో చేష్టలకు' అనంత బాబు ఉదంతమే పరాకాష్ట అని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
హంతకులకు వైసీపీ అడ్డా
వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు హంతకులుగా మారుతున్నారని, చట్టాన్ని చుట్టం చూపుగా చూస్తున్నారని ఆమె విమర్శించారు. డ్రైవర్ సుబ్రమణ్యంను కిరాతకంగా చంపిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి సాక్షులను, బాధితులను, చివరకు న్యాయమూర్తులను కూడా బెదిరించడం అలవాటని ఆమె ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నేరస్తులను కాపాడారని విమర్శించారు. తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయం చేయడం జగన్‌కే సాధ్యమని, బాబాయ్ (వివేకానంద రెడ్డి) గొడ్డలి పోటు ఉదంతాన్ని ప్రజలు ఇప్పటికే చూశారని ఆమె గుర్తు చేశారు.
బాధితులకు న్యాయం చేస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున బాధితులకు న్యాయం జరుగుతుందని, నేరస్తులకు శిక్ష పడే వరకు విశ్రమించబోమని మంత్రి సవిత హామీ ఇచ్చారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఇటీవల కోర్టు కీలక తీర్పులు ఇవ్వడం, అనంతబాబు భార్యపై కూడా ఆరోపణలు రావడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత వేడిని పెంచాయి.
సొంత వారినీ చంపేస్తున్నారు: వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు






