- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏయూ నుంచి వచ్చిన వాళ్లు చాలా రంగాల్లో రాణించారు: Sachin Tendulkar
ఆంధ్రయూనివర్సిటీ వచ్చిన వాళ్లు చాలా రంగాల్లో రాణించారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రయూనివర్సిటీ వచ్చిన వాళ్లు చాలా రంగాల్లో రాణించారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి కుటుంబ నేపథ్యాన్ని సచిన్ ప్రస్తావించారు. తన తండ్రి ఒక ప్రొఫెసర్ అని, ఆయనకు చదువంటే చాలా ఇష్టమని చెప్పారు. అయితే తామంతా రెండు గదులు ఉండే ఇంట్లోనే సర్దుకుని ఉండేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. క్రికెట్‌లో రాణించిన తర్వాతనే ఒక కారు కొనుక్కున్నామని తెలిపారు. పనిపై దృష్టి పెడితే ఎంత ఒత్తిడినైనా తట్టుకోవచ్చని చెప్పారు. నెట్స్ లో తాను చాలా సాధన చేసేవాడినని, లక్ష్యం చేరుకునే సమయంలో తనకు ఎన్నో అనుమానాలు వచ్చేవని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సచిన్ టెండూల్కర్ తెలిపారు.
Next Story






